ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు భీమునిపట్నంలో నామినేషన్లు ప్రారంభం - భీమునిపట్నంలో నాలగో విడత ఎన్నికల నామినేషన్లు

విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో 15 పంచాయతీలకు నామపత్రాల సమర్పణ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని.. ఎన్నికల ప్రత్యేక అధికారిణి జి. చంద్రకళ తెలిపారు. చిప్పాడలోని నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు.

fourth phase election nominations started in bheemunipatnam
నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు భీమునిపట్నంలో నామినేషన్లు ప్రారంభం

By

Published : Feb 10, 2021, 6:12 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని 15 పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. చిప్పాడలోని నామినేషన్ కేంద్రాన్ని మండల ఎన్నికల ప్రత్యేక అధికారిణి జి చంద్రకళతో పాటు ఎమ్డీవో వెంకటరమణ, తహసీల్దార్ కె.వి. ఈశ్వరరావు పరిశీలించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

15 సర్పంచ్, 166 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 32,219 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దాకమర్రి, తాటితూరు, తాళ్లవలస, చిప్పాడ పంచాయతీలను నామినేషన్ కేంద్రాలుగా అధికారులు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details