ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలమంచిలిలో ఐదు గంటల తర్వాత కూడా నామినేషన్లు - pamchayati elections in visakha

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో ఐదు గంటల తర్వాత కూడా నామినేషన్లు స్వీకరించారు​. ఐదు గంటల వరకు వచ్చిన వారందరీ నామినేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. చివరిరోజున తెదేపా, వైకాపా, జనసేన పార్టీల మద్దతుదారులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు.

nomination process at elamanchili zone
ఎలమంచిలిలో ఐదు గంటల తర్వాత కూడా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ

By

Published : Jan 31, 2021, 8:56 PM IST

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో చివరిరోజున సాయంత్రం ఐదు తర్వాత కూడా అధికారులు నామినేషన్లు స్వీకరించారు. రాత్రి ఏ సమయం అయినా సరే ఐదు గంటల వరకు కార్యాలయానికి చేరుకున్న వారందరి నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరిరోజున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావటంతో ఈ పరిస్థితి ఎదురైంది.

ఎలమంచిలి మండలంలో తెదేపా, వైకాపా, జనసేన పార్టీల మద్దతుదారులు ఊరేగింపుగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఏటికొప్పాకలో అత్యధికంగా నామినేషన్లు నమోదయ్యాయి. మూడు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అనుచరులను బరిలోకి దింపాయి. మేజర్ పంచాయతీలలో గట్టి పోటీ కనిపిస్తోంది. ఐదు పంచాయతీలకు కలిపి ఒకచోట నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి

అక్కడ ఊరుంటుంది..ఓట్లే ఉండవు...!

ABOUT THE AUTHOR

...view details