ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 3, 2021, 7:37 PM IST

ETV Bharat / state

'రొమ్ము క్యాన్సర్​పై అవగాహన అవసరం'

ప్రతి మహిళకు రొమ్ము క్యాన్సర్​పై అవగాహన ముఖ్యమని విశాఖ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి చెప్పారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్​పై అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

mammogram package
విశాఖలో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన వార్తలు

మహిళలు రొమ్ము క్యాన్సర్​పై అవగాహన కలిగి సత్వరమే వైద్య పరీక్షలు చేసుకోవాలని విశాఖ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి అన్నారు. నగరంలోని హెల్త్ కేర్ గ్లోబల్ కేంద్రంలో రూ.365తో మెమ్మోగ్రామ్ ప్యాకేజీని ప్రారంభించారు. చాలామంది మహిళలు రొమ్ము క్యాన్సర్​పై అవగాహన లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్​ సమస్యల నుంచి బయటపడవచ్చని చెప్పారు. రూ. 365కే పరీక్షలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో మిస్ వైజాగ్ ఫైనల్ అభ్యర్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details