జనతా కర్ఫ్యూతో బోసిపోయిన ఎలమంచిలి
జనతా కర్ఫ్యూతో విశాఖ జిల్లా ఎలమంచిలి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జనసంచారం లేక ప్రధాన కూడళ్లన్నీ బోసిపోయాయి.
జనతా కర్ఫ్యూతో బోసిపోయిన ఎలమంచిలి
విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు స్పచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాలేదు. వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. మున్సిపల్ కమిషనర్ వీధుల్లో తిరిగి జనతా కర్ఫ్యూ పరిస్థితిని పరిశీలించారు. జాతీయ రహదారి, ప్రధాన వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి.