ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2020, 3:12 PM IST

ETV Bharat / state

డాగ్​ స్క్వాడ్​ను పరిశీలించిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సభ్యులు

శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే డాగ్​ స్క్వాడ్​ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సభ్యులు పరిశీలించారు. విశాఖపట్నం జిల్లా కైలాసగిరి ఆర్ముడ్​ రిజర్వ్ కార్యాలయంలో జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

dog squad
జాగిలాలకు శిక్షణ

విశాఖపట్నం జిల్లా కైలాసగిరిలో ప్రత్యేక శిక్షణ పొందుతున్న డాగ్​స్క్వాడ్​ను ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సభ్యులు పరిశీలించారు. ఆర్ము​డ్​ డీఎస్పీ నేతృత్వంలో పది జాగిలాలకు తర్ఫీదునిస్తున్నారు. వీఐపీ బందోబస్తు విధులు, నేరస్థులను పట్టుకోవటం, మందు పాత్రలు, మాదకద్రవ్యాలను గుర్తించేలా శిక్షణ ఇస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే జాగిలాల పనితీరు, ఆరోగ్యం, చురుకుదనం, స్పందన అంశాలను క్షుణ్ణంగా గమనించారు.

గోల్డ్, రూబీ, క్యాండీ, రూనీ, సిరి, రైడర్, జిక్కీ, రాఖీ, రాబిన్​, వోల్గా జాగిలాల బరువు, శరీర ఉష్ణోగ్రత పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాగ్ పేరు, ప్రత్యేకత, బ్రీడ్, పుట్టిన తేదీ తదితర వివరాలతో ప్రత్యేక ఫైల్ నిర్వహించాలని డీఎస్పీ ట్రైనర్లకు సూచించారు. మందుపాత్రల గుర్తింపు, చోరీలకు సంబంధించిన ఆధారాలు, మాదకద్రవ్యాలను కనిపెట్టడంలో నిరంతరం శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ టి.ఎన్. శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ ఎస్. ప్రతాప్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పోలీసు డ్యూటీ మీట్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details