Inhumanity at the Anganwadi center: విశాఖ సీతమ్మ పేటలో రాజేంద్రనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది. చెప్పిన మాట వినడం లేదని మూడేళ్ల చిన్నారిపై అంగన్‌వాడీ ఆయా దాష్టీకం ప్రదర్శించింది. అగ్గిపుల్ల గిచి చిన్నారి ముఖంపై పెట్టడంతో గాట్లు పడ్డాయి. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు. పాప తల్లి తండ్రులు నాయుడుబాబు, శ్రావణి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాలి అంటే తమ బిడ్డ భయపడుతోందని వారు వాపోతున్నారు. ఆయాపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మూడేళ్ల పాపపై దాష్టీకం ప్రదర్శించిన అంగన్‌వాడీ ఆయా
Inhumanity at the Anganwadi center: విశాఖ సీతమ్మపేటలోని రాజేంద్రనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో చెప్పిన మాట వినలేదని మూడేళ్ల చిన్నారిపై ఆయా దాష్టీకం ప్రదర్శించింది. అగ్గిపుల్ల గీచి చిన్నారి ముఖంపై పెట్టడంతో ముఖంపై గాట్లు పడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాలంటే పాప భయపడుతోందని ఆయాపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మాట వినలేదని మూడేళ్ల పాపపై దాష్టీకం ప్రదర్శించిన అంగన్‌వాడీ ఆయా