ఓ యువకుడు మూడు రోజులుగా విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోనే ఉన్నాడు. ఎడమ పాదం పూర్తిగా గాయమై దుర్వాసన వెదజల్లుతోంది... లేవలేని స్థితిలో సాయంకోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. యువకుడి పేరు మళ్ల శ్రీనివాస్.
ఆదుకోండి సారూ..మూడు రోజులుగా అక్కడే..
మండు వేసవిలో కాలు బయట పెట్టేందుకే భయపడుతున్నారు... అటువంటిది ఓ యువకుడు 3 రోజులుగా విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. తనకు అమ్మానాన్నలు లేరనీ... ఉన్న తమ్ముడు తనను అనాథగా వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడా యువకుడు.
విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరనారాయణపురం గ్రామానికి చెందినవాడు. అక్కడనుంచి చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎలా వచ్చాడో తెలియదు కానీ, గత మూడు రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఇతడి దీనావస్థను గమనించి, గణేష్ అకాడమీకి చెందిన యువకులు రెండు రోజులుగా అన్నం తినిపిస్తున్నారు. తనకు తమ్ముడు ఉన్నా, తనను అనాథగా వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి, ఈ యువకుడును ఆదుకోవాలని కాంప్లెక్స్ వద్ద ఉన్న పండ్ల వర్తకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:'ఎక్కువ మెుక్కలు సంరక్షించిన వారికి అవార్డులు ఇస్తాం'