వరద ఉద్ధృతికి కొండగెడ్డకు గండి
విశాఖ జిల్లా చీడికాడ మండలం జి.కొత్తపల్లి వద్ద ఉన్న కొండగెడ్డకు గండి పడింది. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి... వాగుకు పెద్దఎత్తున వరద నీరు పోటెత్తడంతో గండి పడింది. దీంతో సమీపంలోని పొలాలన్నీ నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
heavy-rain-in-vishaka
.