గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు - gandham Nandagopal Memorial State Level Kabaddi Competitions
విశాఖ జిల్లా కసింకోట మండలం నర్సింగ బిల్లి గ్రామంలో గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. అనకాపల్లి ఎంపీ డాక్టర్. సత్యవతి ఈ పోటీలను ప్రారంభించారు. మహిళా, పురుషుల జట్లు పరిచయ కార్యక్రమం అనంతరం పోటీలు ఘనంగా జరిగాయి. గంధం నందగోపాల్ జయంతి పురస్కరించుకుని నిర్వాహకురాలు గంధం సునీత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీలో అద్భుత ప్రతిభ చూపారు. గ్రామీణ క్రీడ కబడ్డీ పోటీలను తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు.
గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
By
Published : Jan 17, 2020, 7:56 PM IST
...
గంధం నందగోపాల్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు