ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు. ఈనెల 25వ తేదీ వరకు పెంచుతున్నట్లు విశాఖ జిల్లా చీడికాడ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ హీరాలాల్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. విశాఖ జిల్లాలోని చీడికాడ, నర్సీపట్నం, రావికమతం, కసింకోట, మునగపాక మండలాల్లో 5 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశాలు లాటరీ ద్వారా రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉంటాయని చెప్పారు.