ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టండి: కలెక్టర్

విశాఖలో కొవిడ్ సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరగటంపై దృష్టి సారించాలన్నారు.

Collector Vinay Chand
కలెక్టర్ వినయ్ చంద్

By

Published : May 23, 2021, 8:06 AM IST

విశాఖలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యంపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీఎంఆర్డీఏ థియేటర్ లో ఈ సమీక్ష జరిగింది. గ్రామీణ ప్రాంతంలో కొవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.

ఆ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ , వెంటిలేటర్లు, ఇంజక్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స నిమిత్తం తగిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details