విశాఖ జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ మరణాలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా మృతుల ఖననానికి శ్మశాన వాటికలో స్థలాల కరవయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారికంగా ఇరవై నాలుగు రోజుల్లో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో 60 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు సాధారణ మరణాలు సంభవిస్తుండటంతో ఖననానికి శ్మశాన వాటికలో చోటు సరిపోవటం లేదని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరణాలు పెరిగితే ఖనన స్థలాలకు అవస్థలు పడాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు.
పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కరవవుతున్న ఖనన స్థలం
విశాఖ జిల్లా నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ కారణంగా శ్మశాన వాటికల్లో వీటి ఖననానికి చోటు కరవవుతోంది. రానున్న రోజుల్లో మరణాలు పెరిగితే తీవ్ర అవస్థలు తప్పవని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు.
కొవిడ్ మృతులు