రైల్వే జోనే ఇచ్చేది మేమే - cit
సిట్ నివేదికను బయటకు విడుదల చేసిన తర్వాతే ఎన్నికల్లో పోటీచేయాలని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.

భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో పార్టీలకతీతంగా పని చేస్తున్నానని భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేది తామేనని తెచ్చేది తామేనని... రైల్వే జోన్ అంశంపై రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. సిట్ నివేదికను బయటపడితే ప్రభుత్వం కూలిపోతుందని అందుకే సీఎం చంద్రబాబు ఆ వివరాలు బహిర్గతం చేయటంలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. నివేదిక బయటకు వచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు