విశాఖ జిల్లా ఆనందపురం పెద్దిపాలెంలో రైతుల అవగాహన సదస్సును భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ కంబంపాటి హరిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొత్త వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకోవచ్చని పురంధేశ్వరి అన్నారు. 2022 నాటికి రైతులందరికీ రెట్టింపు ఆదాయం కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మార్కెట్ యార్డులతో పాటు బయట కూడా రైతులు పంటల ఉత్పత్తులను అమ్ముకోవచ్చన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో రైతులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందన్నారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను మభ్యపెడుతున్నాయని పురంధేశ్వరి ఆరోపించారు.
'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది' - వ్యవసాయ చట్టాలపై తాజా వార్తలు
కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం పెద్దిపాలెంలో రైతుల అవగాహన సదస్సును భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ కంబంపాటి హరిబాబు ప్రారంభించారు.

bjp leader purandreswari on agriculture bills