విశాఖ నగరంలోని మహారాణిపేటకు చెందిన పి. వెంకట అశోక్ కుమార్... కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం తన స్నేహితులతో కలిసి మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. అదే సమయంలో జీవీఎంసీ మహాత్మ ఆదర్శ నగర్‌కు చెందిన పాలవలస మణికంఠ కూడా తన స్నేహితులతో రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు. ఇరువర్గాలు మద్యం తాగి, స్నానాలు చేసేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం తలెత్తింది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ... కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
విశాఖ భగత్ సింగ్ నగర్లో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకున్న మణికంఠ... భగత్ సింగ్ నగర్ కూడలి వద్ద అశోక్ కుమార్‌పై తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు. ఈ ఘర్షణలో అశోక్‌తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ మళ్ల అప్పారావు తెలిపారు.
ఇదీచదవండి: లక్ష్మీఅపర్ణకు మహిళా లోకం అండగా ఉండాలి: అనిత