ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దేరుకు వరదపోటు... జలాశయం కళకళ!

పెద్దేరు మధ్యతరహా జలాశయంలో భారీగా వరద నీరు చేరుతోంది. నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరింది.

నిండుకుండలా నిండిన  పెద్దేరు జలాశయం

By

Published : Aug 10, 2019, 12:34 PM IST

నిండుకుండలా నిండిన పెద్దేరు జలాశయం

విశాఖ జిల్లా మాడుగుల మండల సమీపంలోని పెద్దేరు మధ్యతరహా జలాశయంలో వరదనీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం నీటి నిల్వలతో జలాశయంలో కళకళలాడుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం 136.55 మీటర్లు ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 393 క్యూసెక్కుల వరకు నీరు జలాశయంలోకి చేరుతోంది. జలాశయం నుంచి ఈ ప్రాంతానికి ఖరీఫ్ నాట్లకు కాలువల ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరగడంతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాత్రి సమయాల్లో వరద గేట్ల నుంచి అదనపు నీటిని నదిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details