విశాఖ జిల్లీ తీగలవలస గ్రామ సమీపంలోని గుడ్డిగుమ్మి జలపాతంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు వెలికి తీశారు. హుకుంపేట మండలం తీగలవలసకొండల్లో ఉన్న గుడ్డి గుమ్మి జలపాతంలో ఆదివారం మధ్యాహ్నం పదిమంది యువకులు ఫోటోలు తీసుకుంటుండగా కాలుజారి ఒకరు పడిపోయారు.
రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరు నీటిలో పడిపోయారు. పోలీసులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది నిన్న సహాయక చర్యలు చేసినప్పటికీ రాత్రి కావడంతో వెనుదిరిగారు. ఇవాళ ఉదయం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా.. కాసేపటికి మిగతా వ్యక్తి మృతదేహాన్ని సైతం గుర్తించారు.