ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 20, 2022, 11:03 PM IST

Updated : Dec 21, 2022, 7:11 AM IST

ETV Bharat / state

ప్రపంచ రికార్డు దిశగా.. రాయ్‌పూర్​లో విష్ణు సహస్ర నామ పారాయణం

Balaji Kalyan Temple Committee in Raipur: ఆంధ్రా అసోసియేషన్‌, బాలాజీ కల్యాణ్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో.. రాయ్‌పూర్‌లోని గుడియారిలో విష్ణుసహస్రనామ పారాయణతో ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాలాజీ ఆలయ ప్రాంగణంలో 5 కోట్ల విష్ణు సహస్రనామ పఠన లక్ష్యంతో పారాయణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజుల్లో ఇప్పటి వరకు 3.5 కోట్ల విష్ణు సహస్రనామాలను పారాయణం పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

jkjkj
jkjkj

Limca Book of World Records: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని గుధియారీలోని తిలక్ నగర్‌లో ఉన్న శ్రీ బాలాజీ ఆలయంలో గత నాలుగు రోజులుగా భక్తిశ్రద్ధలతో లోక కల్యాణం కోసం విష్ణు సహస్ర నామం పఠిస్తున్నారు. స్త్రీలు, పురుషులతో పాటు తిరుపతికి చెందిన పండితులు ఈ విష్ణుసహస్ర నామ పారాయణం చేస్తున్నారు. ఐదో రోజైన బుధవారం ఈ కార్యక్రమం ముగించనున్నారు. ఐదు కోట్ల విష్ణు సహస్ర నామ పారాయణమే లక్ష్యంగా కొనసాగిస్తున్నట్లు పండితులు తెలిపారు. 3 రోజులుగా మూడున్నర కోట్ల విష్ణు సహస్ర నామాలు పఠించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మెుత్తంగా 5కోట్ల విష్ణుసహస్ర నామ పారాయణ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు.

ఆంధ్రా అసోసియేషన్‌, బాలాజీ కల్యాణ్‌ ఆలయ కమిటీ కోశాధికారి మోహన్‌ కె. నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వందలాది మంది భక్తులు పారాయణం చేశారని.. ఆంధ్రా అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. మానవజాతి హితంతో పాటుగా.. లోకోద్దారణ, సంక్షేమం, పర్యావరణ హితం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విష్ణు సహస్రనామం పఠించేందుకు ఐదు రోజులపాటు నిత్యం 50 వేల మంది భక్తులు 1000 సార్లు విష్ణు సహస్రనామం పఠిస్తే 5 కోట్లు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.. దీని కోసం వరల్డ్ రికార్డ్ బృందం సభ్యులు ఇక్కడకు వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం కార్యక్రమాన్ని అంచనా వేయడానికి అలాగే వీడియో తీస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details