ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనాథ యువతిపై వాలంటీరు అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు - అనాథ యువతిపై వాలంటీరు అత్యాచారం

Rape of a young woman living alone: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న యువతిపై.. పశుత్వం ప్రదర్శించాడు ఓ వాలంటీర్‌. ఎవరూ లేని ఆ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు గర్భందాల్చడంతో మందస పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితున్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

Rape of a young woman living alone
Rape of a young woman living alone

By

Published : Feb 9, 2023, 12:10 PM IST

Updated : Feb 9, 2023, 1:40 PM IST

Rape of a young woman living alone: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతిపై గ్రామవాలంటీరు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన దళిత యువతి తల్లిదండ్రులు.. కొన్ని నెలల క్రితం మరణించారు. నాటినుంచి ఆమె మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీఓ కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది.

దాదాపు నెల క్రితం అదే మండలంలోని జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కణితి బాలకృష్ణ ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు.. పోలీసులు తెలిపారు. బాధితురాలు గర్భం దాల్చడంతో మంగళవారం మందస పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని.. నిందితున్ని అరెస్ట్ చేస్తామని.. పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 9, 2023, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details