ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2022, 4:19 PM IST

ETV Bharat / state

మార్గమధ్యలోనే ప్రసవించిన మహిళ... రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అగచాట్లు

వారి బతుకులు ఊరికి దూరంగా... అడవికి దగ్గర... కాళ్లు అరిగేలా నడిచినా రహదారి కానరాదాయే... అందుకే కిలో మీటర్ల దూరం నడిచి ఆస్పత్రికి చేరే వరకు కొందరు ప్రసవవేదనతో తల్లడిల్లుతారు... మరికొందరు దారిలోనే బిడ్డకు జన్మనిస్తారు. చుట్టూ ఉన్నవారు తల్లిబిడ్డకు ఏమవుతుందో అని బిక్కుబిక్కుమంటుంటారు. ఇంతటి దీనస్థితి ఇంకెక్కడో అనుకునేరు... మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోనే...

woman Delivered on road
దారిలోనే బిడ్డకు జన్మనిచ్చిన గిరిజన మహిళ

woman Delivered on road: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం గూడ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం లేదు. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి ఏం జరిగినా గ్రామం నుంచి 6 కిలోమీటర్ల మేర కనీస రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు. మహిళలు ప్రసవవేదనతో అల్లాడిపోతారు. తాజాగా గ్రామానికి చెందిన నిర్మళ అనే మహిళకు పురుటినొప్పులు రావడంతో... ఆసుపత్రికి తరలించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

woman Delivered on road: 6 కిలోమీటర్ల మేర కనీస రహదారి లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. డోలి సహాయంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ప్రతి విషయంలోనూ రోడ్డు మార్గంలేక ఏళ్లుగా తీవ్ర కష్టాలు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:నందికొట్కూరులో ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details