ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా రహిత జిల్లాగా శ్రీకాకుళం.. మరింత పటిష్టంగా లాక్​డౌన్​ - శ్రీకాకుళంలో లాక్​డౌన్ మరింత కఠినం

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్​ కేసు కూడా నమోదు కాకపోవటంతో... అదే స్ఫూర్తితో లాక్​డౌన్​ కొనసాగాలని అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ఎవ్వరూ రాకుండా జిల్లా సరిహద్దును పోలీసులు మూసివేశారు. జిల్లా, మండల సరిహద్దుల్లో హెచ్చరికలు జారీ చేశారు.

preplanned precautionary measures are taken at srikakulam to prevent corona
కరోనా కేసులు నమోదవ్వకుండా శ్రీకాకుళంలో ముందస్తు చర్యలు

By

Published : Apr 12, 2020, 1:17 PM IST

శ్రీకాకుళం జిల్లా కరోనా వైరస్ రహిత జిల్లాగా కొనసాగుతుండటంతో... జిల్లాలో అధికారులు లాక్ డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండల సరిహద్దుల్లో ప్రత్యేక సూచికలు పెట్టి ఇతర ప్రాంతాల వారు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లా సరిహద్దులు సైతం మూసివేశారు. నరసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మడపాం, జమ్ము కూడలి, దేశవానిపేట తదితర ప్రాంతాల్లో నిఘా పెంచినట్టు పోలీసులు ప్రకటించారు. ఎవరైనా మండలంలోకి రావాలంటే ముందస్తు అనుమతులు పొందాలని తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details