శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. అధికారులు.. మండలంలో 1600 మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. 0-5 సంత్సరాల వయస్సు గల పిల్లల తల్లులతో పాటు , 45 ఏళ్లు దాటిన కొద్ది మందికి టీకా అందించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు సుమారు 3 గంటల వరకు నిరీక్షించారు. వ్యాక్సిన్ అందని వారు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
వీరఘట్టం పీహెచ్సీలో వ్యాక్సినేషన్.. టీకా అందని ప్రజల ఆందోళన - శ్రీకాకుళం జిల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమం
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం పీహెచ్సీలో అధికారులు టీకా కార్యక్రమం నిర్వహించారు. సరిపడా వ్యాక్సిన్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. సిబ్బందితో వాగ్వాదానికి నిరాశతో వెనుదిరిగారు.

people protest for vaccine at veeraghattam srikakulam district