సుసరాం తంపర భూములను పరిశీలించిన శ్రీకాకుళం ఎంపీ
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సుసరాం తంపర భూములను తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా పంట భూములు నీట మునిగి.. తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి... సహాయం చెయ్యాలని ఎంపీ కోరారు.