ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2019, 7:04 AM IST

ETV Bharat / state

యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని... లక్షలు దోచేశాడు

ఓ విద్యార్థినికి యానివర్సిటీలో వెటర్నరీ సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దానికి 2 లక్షలు ఖర్చవుతుందని డిమాండ్ చేశాడు. అది నమ్మి డబ్బు అతని ఖాతాలో జమ చేసినా విద్యార్థినికి సీటురాకపోగా.. ఫోన్​లో అందుబాటులోకి రాకుండా పోయాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా...మోసగాడి అసలు రూపం బయటపడింది.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ

కర్ణాటక యూనివర్సిటీలో వెటర్నరీ సీటు ఇప్పిస్తానని విద్యార్థిని నుంచి 2 లక్షలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఓ విద్యార్థిని నీట్ పరీక్ష రాసింది. పరీక్షలో ర్యాంకు రాకపోవటంతో సదరు వ్యక్తిని సంప్రదించింది. చత్తీస్​ఘడ్ దుర్గ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ సింగ్ కర్నాటక యూనివర్సిటీలో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు.సీటుకోసం 2 లక్షలు, కన్సల్టింగ్ రుసుం కింద మరో 45 వేలు ఇవ్వాలని కోరాడు. అతడి మాయమాటలు నమ్మిన బాధితురాలు జూన్​లో 2 లక్షలు ఖాతాలో జమ చేసింది. నెలలు గడుస్తున్నా..సీటు విషయం తేలకపోగా..ఫోన్​లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయానని బాధితురాలు గ్రహించింది. ఈ మేరకు పోలీసులను ఆశ్రయించి వివరాలు వెల్లడించింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ

ABOUT THE AUTHOR

...view details