శ్రీకాకుళం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారుగా 15,900 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే దాదాపు 9 వేల హెక్టార్లలో పంట సాగయ్యింది. అయితే పంట వేసినప్పటి నుంచి కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. పంట మొక్క, కోత దశల్లో కత్తెర పురుగు సోకి సగానికి పైగా పంట నాశనమైంది. ప్రస్తుతం జిల్లాలో కురుస్తోన్న భారీ వర్షాలు మొక్కజొన్న రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. తీసిన పంట 20 రోజులుగా కళ్లాల్లోనే ఉండిపోవడం వల్ల కంకుల్లో నుంచి మొలకలు వస్తున్నాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
సిక్కోలులో భారీ వర్షాలు... మొక్కజొన్న రైతులకు కష్టాలు - heavy crop loss in srikakulam district
ఓ వైపు కత్తెర పురుగు... మరోవైపు భారీగా కురుస్తోన్న వర్షాలు శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న రైతులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. పంట పూర్తిగా తడిసి కంకుల్లో నుంచి మొలకలు వస్తున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

భారీ వర్షాలు... అన్నదాతల్లో కన్నీళ్లు