శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వంజంగి, తోగరాం గ్రామాల్లో పేదలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సభాపతి తమ్మినేని సీతారాం నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. తన తల్లిదండ్రులైన ఇందుమతి, శ్రీరామ్మూర్తి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీటిని అందజేస్తున్నట్లు సీతారాం తెలిపారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీతారాం సతీమణి వాణి, తనయుడితో పాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సభాపతి - ఆమదాలవలసలో నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఆమదాలవలసలో పేదలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సభాపతి తమ్మినేని సీతారాం నిత్యావసరాలు అందజేశారు.

due to corona lockdown Distribution of essential needs the poor by thamineni sitharam at amudhavalasa in srikakulam