శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం నాయరాల వలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్న నోటితో చిత్రాలు గీస్తూ అందరినీ అబ్బుర పరుస్తుంది. చిన్నతనంలోనే విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకుంది. తల్లి సత్యవతి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. స్వప్న దాతల సహకారంతో డిగ్రీ వరకు చదువుకుంది. ఏదో సాధించాలన్నా లక్ష్యంతో సాధన చేస్తూ చిత్రకళా రంగాన్ని ఎంచుకుని పలు చిత్రాలను గీస్తుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మెచ్చుకునేలా చేసింది. స్వప్న బొమ్మలు గీయటంతోపాటు, డాన్స్, రన్నింగ్ లో సైతం ప్రతిభ కనబరుస్తుంది.
జనసైనికులుతోపాటు కొందరు దాతల సహకారంతో గాజుల షాపు పెట్టుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసి పుట్టినరోజు కానుకగా పంపించినందుకు ఆయన స్వప్నను అభినందిస్తూ.. త్వరలో కలుస్తానని చెప్పారు. దీంతో స్వప్న ఆనందానికి హద్దులు లేవు.