శ్రీకాకుళం జిల్లాలోని మండలాల పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ అమ్మి రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి నరసన్నపేటలో పలు చెక్ పోస్ట్ లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లతో పాటు మరో 150 వరకు మండలాల చెక్ పోస్ట్ లను అందుబాటులోకి తెచ్చామని జిల్లా ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త చెక్ పోస్ట్ లను తెరిచామని.. గ్రామ సచివాలయ సిబ్బంది సహకారం తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉందని.. ప్రజలు సహకరిస్తున్నారని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
'జిల్లాలో 150 కొత్త చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం'
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వేళ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లతో పాటు మరో 150 వరకు మండలాల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామన్నారు.
'జిల్లాలో 150 కొత్త చెక్ పోస్ట్ లు తెరిచాం'