ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా కార్యకర్తలు నిరసనకు దిగారు. గతంలో ఉన్న రౌడీషీట్ నెపంతో ఓ వ్యక్తిని అక్రమంగా స్టేషన్కు తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నా ఒక్కడిని మాత్రమే తీసుకెళ్లారని బాధితుని కుటుంబ సభ్యులు, బల్లికురవ గ్రామస్థులు పేర్కొన్నారు. దీనిపై ప్రశ్నించగా పోలీసులు తమతో నోటికొచ్చినట్లు మాట్లాడారని వాపోయారు. దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
'రౌడీషీటర్ నెపంతో అరెస్టు చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలి' - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
గతంలో ఉన్న రౌడీషీట్ ఆధారంగా అరెస్టు చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలి తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుని బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు.

రౌడీషీటర్ నెపంతో అరెస్టు చేసిన వ్యక్తిని వెంటనే విడుదల చేయాలి