ఎస్సీలంతా సీఎం జగన్‌కు అండగా ఉండాలని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ కోరారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని ఏఎంసీ ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన దళిత ఐక్యవేదిక సభలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని సురేశ్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతిని కాంక్షించి ముఖ్యమంత్రి జగన్ వివిధ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. దళితులంతా ఐక్యంగా మెలిగి అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. 20 ఏళ్లలో ఎస్సీల జీవితాలు మారబోతున్నాయని ఎంపీ సురేశ్ వ్యాఖ్యానించారు.
ఎస్సీలంతా సీఎం జగన్‌కు అండగా ఉండాలి: ఎంపీ సురేశ్ - ఎంపీ నందిగం సురేశ్ తాజా వార్తలు
దళితుల సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఉన్నతిని కాంక్షించి వివిధ పథకాలను అమలు చేస్తున్న సీఎంకు అండగా ఉండాలని ఎస్సీలను కోరారు.

mp suresh