ప్రకాశం జిల్లాలో పోలీసుల పనితీరు హర్షించదగ్గ స్థాయిలో ఉందని ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారు. మార్కాపురంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కరోనా రిలీఫ్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సిబ్బందికి సరుకులు అందజేశారు.
పోలీసుల పనితీరు హర్షణీయం: సిద్దార్ధ్ కౌశల్ - మార్కాపురం రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పర్యటించారు. రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించారు. జిల్లాలో పోలీసుల పనితీరు హర్షణీయమని అభినందించారు.

మార్కాపురంలో ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ పర్యటన