రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా భాధ్యులు రావి రామనాథం తెలిపారు. మార్కెట్ యార్డులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. డీసీఎంఎస్ ఛైర్మన్‌తో కలిసి ప్రారంభించారు. రాయితీపై తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఇస్తూ.. జగన్ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
'రైతుల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం' - ravi ramanadham in pea seeds distribution at parchuru
ప్రకాశం జిల్లా పర్చూరు మార్కెట్ యార్డులో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. వైకాపా ఇన్ఛార్జ్ రావి రామనాథం ప్రారంభించారు. రైతుకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. రాయితీపై సేద్యానికి అవసరమైన వివిధ ఉత్పత్తులను అందిస్తోందని తెలిపారు.

శనగ విత్తనాల పంపిణీలో పర్చూరు వైకాపా ఇన్ఛార్జ్