ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిలిచిపోయిన పశుదాణా సరఫరా.. బక్కచిక్కుతున్న మూగజీవాలు - food for Livestock shortage news

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతన్నలు తమకు ఆర్థిక ఆసరాగా ఉండే పాడినీ కాపాడుకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. దాణా, సైౖలేజ్‌ గడ్డిని ప్రభుత్వం పంపిణీ చేయకపోతుండడంతో వరిగడ్డి కొనలేక, పశుపోషణ చేయలేక సతమతమవుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు పశువులను విక్రయిస్తుండగా ఇప్పటికే చాలావరకు వధశాలలకు తరలిపోయాయి.

no dry food for animals
బక్కచిక్కుతున్న మూగజీవాలు

By

Published : Jan 10, 2021, 5:46 PM IST

ప్రకాశం జిల్లాలోని చాలా మంది రైతులు కనీసం రెండు.. అంతకు మించిన సంఖ్యలో పశువులను పోషిస్తున్నారు. వాటికి గతంలో 25 వేల మెట్రిక్‌ టన్నుల సైౖలేజ్‌(పాతర) గడ్డి, 4 వేల మెట్రిక్‌ టన్నుల దాణామృతం, 7 వేల మెట్రిక్‌ టన్నుల దాణాను ప్రభుత్వం సరఫరా చేసేది. అలాంటిది ఏడాదిగా పంపిణీని నిలిపివేసింది. దాంతో అక్టోబరు ముందు వరకు వర్షాల్లేక, పచ్చిగడ్డి దొరక్క పోషకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నవంబరులో వర్షాలు కురవడంతో పచ్చిగడ్డి సమస్య కొంత తీరినా దాణా, దాణామృతం, సైౖలేజ్‌ అందకపోతుండడంతో సుదూర ప్రాంతాల నుంచి‌ వరిగడ్డిని సుమారు రూ.16 వేలకు, కిలో రూ.2కు లభించిన సైలేజ్‌ను రూ.6కు కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. గడ్డి కొరతతో బక్కచిక్కిన పాడి గేదెలు, ఎద్దులను అమ్మేసుకుంటుండగా వాటిని వ్యాపారులు లారీల్లో వధశాలలకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ స్పందించి దాణా, దాణామృతం, సైలేజ్‌ సరఫరా చేయాలని వేడుకుంటున్నారు.

దూర ప్రాంతం నుంచి ట్రాక్టర్‌లో వరిగడ్డిని తెచ్చుకుంటున్న రైతు

మార్చిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం:

"జిల్లాలో ఏడాది నుంచి తమ శాఖ ద్వారా దాణామృతం, పశుదాణా, సైౖలేజ్‌ గడ్డి సరఫరా కాని మాట వాస్తవమే. వేసవిలో పాడి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా మార్చి నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపుతాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని అందజేస్తాం" -రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, జేడీ, పశుసంవర్ధక శాఖ

జిల్లాలోని పశువుల వివరాలు

ఇదీ చదవండి:పాలీహౌస్ సాగు వైపు.. నెల్లూరు రైతుల చూపు

ABOUT THE AUTHOR

...view details