ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో ఎమ్మెల్యే బలరాం పర్యటన - LATEST TOUR OF CHEERALA MLA KARANAM BALARAM

అర్హులందరికీ పింఛన్​లు అందించాలని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. చీరాలలో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలపై ఆరా తీశారు.

MLA KARANAM BALARAM
చీరాలలో ఎమ్మెల్యే బలరాం పర్యటన... సమస్యలపై ఆరా

By

Published : Feb 15, 2020, 5:16 PM IST

Updated : Feb 15, 2020, 11:27 PM IST

చీరాలలో ఎమ్మెల్యే బలరాం పర్యటన... సమస్యలపై ఆరా

ప్రకాశం జిల్లా చీరాలలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే కరణం బలరాం పర్యటించారు.. ప్రజల సమస్యలను ఆడిగితెలుసుకున్నారు. స్వర్ణ రహదారిలో మురుగుకాలువల పరిస్దితి అధ్వాన్నంగా తయారైందని, డ్రైనేజీలో పారుదల లేక మురుగునీరు నిలుస్తోందని, దీనివల్ల దోమలు ఎక్కువయ్యాయని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కారంచేడు రహదారిలో ఉన్న శ్మశానవాటిక బాగుచేయాలని ప్రజలు కోరారు. అనంతరం చీరాల ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్ల విషయమై ఒంగోలు ఆర్డీవో ప్రభాకర్ రెడ్డి తో మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందించటం మన భాధ్యత అని... అధికారులు ఆ దిశగా అడుగులువేయాలని సూచించారు.

ఇవీ చూడండి-'వృద్ధ తల్లిదండ్రులను వేధిస్తే జైలు శిక్ష తప్పదు'

Last Updated : Feb 15, 2020, 11:27 PM IST

ABOUT THE AUTHOR

...view details