ఈ ఏడాది పొగాకులో బ్రైట్ రకం ఉత్పత్తి అధికంగా రావడంతో రైతులకు మంచి ధర లభిస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట రెండవ వేలం కేంద్రంలో, పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘనాథ్ బాబుతో కలిసి ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను ప్రారంభించారు. తొలుత పూజలు నిర్వహించి వేలం ప్రక్రియను ప్రారంభించిన ఆయన వేలం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ఒంగోలులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. వేలం వివరాలకు అధికారులను అడిగి తెలుకున్నారు.
వేలం వివరాలను అడిగి తెలుసుకుంటున్న మంత్రి
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతేడాది లోగ్రేడ్ రకం ఎక్కువ ఉత్పత్తి కావడంతో రైతులకు ధర లభించలేదని అందువల్ల మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయించి రైతులకు ప్రయోజనం కల్పించామన్నారు. ఈ ఏడాది అటువంటి పరిస్థితి రాదని అనుకుంటున్నామన్నారు. పొగాకు బోర్డు ఛైర్మన్ రఘునాథ్ బాబు మాట్లాడుతూ, గతేడాది వివిధ పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బంది కలిగిందన్నారు.