ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలోని రైతులకు ట్రాన్స్ఫార్మర్(విద్యుత్ పరివర్తకం) ఏర్పాటు కోసం రూ.51000 లంచం తీసుకుంటుండగా లైన్మెన్ నాయక్ ను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. గ్రామంలోని తొమ్మిదిమంది రైతులు కలసి రెండు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల కోసం గ్రామ లైన్మెన్నాయక్ని ఆశ్రయించగా.. లక్ష రూపాయలు అవుతుందని తెలిపారు. మొదటి విడితగా 50వేల రూపాయలు రైతులు లైన్మెన్కు చెల్లించారు. డబ్బులు తీసుకున్న అనంతరం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయటంలో లైన్ మెన్ నాయక్ ఆలస్యం వహిస్తుండటంతో విసుగు చెందిన రైతులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రాజంపల్లి చేరుకుని ఓ రైతు ఇంట్లో మాటువేసి రైతు వద్దనుంచి లైన్ మెన్ నాయక్ మిగతా 51000 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం నాయక్‌ను విచారించి అరెస్టు చేసినట్లుగా ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ రెడ్డి తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం లంచం.. ఏసీబీకి పట్టుబడ్డ లైన్మెన్ - దర్శి మండలం
వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతుల నుంచి లంచం తీసుకుంటున్న ఓ లైన్‌మెన్‌ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ కోసం ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలోని రైతులు లైన్‌మెన్‌ని ఆశ్రయించగా.. లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. అయినా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో లైన్మెన్ నాయక్ ఆలస్యం వహిస్తుండటంతో విసుగు చెందిన రైతులు అవినీతి నిరోధక శాఖ ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం మిగతా డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆ లైన్మెన్ను పట్టుకున్నారు.

ఏసీబీకి పట్టుబడ్డ లైన్మెన్