ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో భారీగా ఇసుక తవ్వకాలు - prakasam district

చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లోనూ ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నేతల అండ ఉండటం వల్ల అధికారులు అక్రమ తవ్వకాలను పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

heavy-sand-mining-in-prakasam-district-in-ap

By

Published : Aug 21, 2019, 2:17 PM IST

ప్రకాశం జిల్లాలో భారీగా ఇసుక తవ్వకాలు

ఇసుక తవ్వకం, రవాణాపై ఆంక్షలు..అక్రమార్కులకు పట్టడం లేదు. రాత్రి వేళల్లో తరలించరాదన్న నిబంధనలున్నా యథేచ్చగా తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల స్థలాలను వదలడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదల వల్ల అక్కడి నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఆయా ప్రాంతాలకు చెందిన లారీలు కూడా రావడం వల్ల.... తవ్వకాల జోరు మరింత పెరిగింది. రాజకీయ నేతల అండా ఉండటం వల్ల..అక్రమ ఇసుస తవ్వకాలపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానికులు దీనిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details