ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 4, 2020, 7:14 PM IST

ETV Bharat / state

'కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, వైద్యులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

'కరోనా మహమ్మారిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

విపత్కర పరిస్థితుల్లో పోలీసులు, వైద్యులు వారి కుటుంబాలను సైతం పక్కన పెట్టి సమాజం కోసం కష్టపడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో పర్యటించిన ఆయన...పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వైరస్ నిర్మూలనకు పట్టణంలో బ్లీచింగ్, సోడియం ప్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. దిల్లీకి వెళ్లివచ్చిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు రాత్రి 9 గంటలకు విద్యుత్​ దీపాలు ఆఫ్​ చేసి దీపాలు వెలిగించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details