ఒంగోలులో వార్డు వాలంటీర్ దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవదహనం ఘటనకు కారణాలింకా తెలియరాలేదు. శుక్రవారం రాత్రి... దశరాజుపల్లెకు వెళ్తూ ట్రై-సైకిల్‌పైనే ఆమె సజీవదహనమైంది. అది ఆత్మహత్యా లేదా హత్యా అన్న అంశంపై స్పష్టత రావట్లేదు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత... ఆమె ఆ దారిలో వెళ్తుండటం కొందరు చూశారని చెబుతున్నారు. అదే సమయంలో భువనేశ్వరి తన వాట్సప్ స్టేటస్ ద్వారా... పలువురికి మిస్ యూ, ఇదే నా చివరి మెసేజ్ అంటూ పోస్ట్ చేసింది.
దివ్యాంగురాలి సజీవదహనం ఘటన: కారణాలేంటీ..? - ప్రకాశం జిల్లా నేర వార్తలు
వార్డు వాలంటీర్ దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవదహనం ఘటనకు కారణాలింకా తెలియరాలేదు. అది ఆత్మహత్యా లేదా హత్యా అన్న అంశంపై స్పష్టత రావట్లేదు. భువనేశ్వరి చివరగా పెట్టిన వాట్సప్ స్టేటస్‌ల ఆధారంగా.... ఆమెతో సన్నిహితంగా ఎవరు ఉండేవారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

దివ్యాంగురాలి సజీవదహనం ఘటన: కారణాలేంటీ..?
దివ్యాంగురాలి సజీవదహనం ఘటన: కారణాలేంటీ..?
ఆ తర్వాత రాత్రి 8 గంటల సమయంలో ఆమె మంటల్లో కాలిపోతున్నట్టు స్థానికులు గమనించి.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినా వారొచ్చేసరికే అగ్నికి ఆహుతైంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకూ వార్డు సచివాలయంలోనే ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి చివరగా పెట్టిన వాట్సప్ స్టేటస్‌ల ఆధారంగా.... ఆమెతో సన్నిహితంగా ఎవరు ఉండేవారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది: చంద్రబాబు