ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరేసుకున్న వివాహిత.. మృతిపై అనుమానాలు

Suspicious death: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో వంట గదిలో విగత జీవిగా పడి ఉన్న ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుని బతుకు తెరువు కోసం రాయవరం వచ్చి జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Suspicious death
అనుమానస్పద మృతి

By

Published : Oct 28, 2022, 5:38 PM IST

Suspicious death: ఓ వివాహిత వంట గదిలో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్న ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో చోటు చేసుకుంది. నాగమణి, భర్త మోహనసాయితో కలిసి రాయవరంలోని నివాసముంటున్నారు. మోహనసాయి పని ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చే సమయంలో తన భార్య వంట గదిలో ఉరేసుకుని కనిపించడం చూసి.. పోలీసులకు ఫోన్ చేసి తెలియజేశాడు.

ఏడాది క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్నారని,.. బతుకుదెరువు కోసం రాయవరం వచ్చి ఉంటున్నారని పోలీసులు తెలిపారు. మోహన్ సాయి ప్రతి రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తాడని.. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయన్నారు. వారికి రెండు నెలల పసికందు ఉందని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details