రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉపసభాపతి కోనా రఘపతి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు. మార్కెట్ ఛైర్మన్గా ఎమ్.గ్రగోరీ, వైస్ ఛైర్మన్గా సుబ్బారెడ్డి, మిగిలిన పాలకవర్గ సభ్యులతో సంబంధిత అధికారులు ప్రమాణం చేయించారు. అన్నదాతల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని బాలినేని అన్నారు. విత్తనాలు, ఎరువులు, రాయితీలు, రుణాల విషయంలో రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
చీరాల వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ప్రకాశం జిల్లా చీరాల వ్యవసాయ మర్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉపసభాపతి కోన రఘపతి తదితరులు పాల్గొన్నారు.
చీరాల వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
TAGGED:
చీరావ మార్కెట్ తాజా వార్తలుట