ROAD ACCIDENT AT GIDDALUR: ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం.. వివేకానంద కాలనీ సమీపంలోని అమరావతి- అనంతపురం జాతీయ రహదారి పై కారు, బొలెరో వాహనం ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
ROAD ACCIDENT AT GIDDALUR: కారు- బొలెరో ఢీ.. ఎనిమిది మందికి గాయాలు - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
ROAD ACCIDENT AT GIDDALUR: ప్రకాశం జిల్లాలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బొలెరో వాహనంలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు. వీరందరూ కర్నూలు జిల్లా డోన్ నుంచి గుంటూరుకు మిరపకాయ కోతలకు వెళ్తున్న వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:Love on own village: మాతృభూమిపై ప్రవాసుడి ప్రేమ.. 28 ఏళ్లుగా అన్నీ తానై