ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల సమావేశాలు తూతుమంత్రంగా ఉంటే వృథానే...' - rythu bharosa centre

రైతుల సమావేశాలు తూతుమంత్రంగా నిర్వహిస్తే ఉపయోగం ఉండదని, వారిని చైతన్యపరిచేలా సమావేశాలు సాగాలని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులకు సూచించారు.

praksam district
రైతుల సమావేశాలు తూతుమంత్రంగా వృధానే

By

Published : Jul 9, 2020, 6:08 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ముందుగా రైతు భరోసా కేంద్రాన్ని, ల్యాబ్ ను పరిశీలించారు. పర్చూరు నియోజకవర్గంలో 60 వేల రైతు కుటుంబాలున్నాయని.. తూతుమంత్రంగా సమావేశం నిర్వహిస్తే రైతులకు ప్రయోజనం ఉండదన్నారు.

రైతు సమావేశం అంటే వ్యవసాయ శాఖే కాదు.. దానికి అనుబంధంగా ఉన్న శాఖలన్ని ఉండి రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పారు. నియోజకవర్గంలో మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారని, మరల మూడు నెలల్లో కొత్త మిర్చి పంట మార్కెట్​కు వస్తుంది.. ప్రభుత్వం వెంటనే పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని చెప్పారు. అనంతరం ఆయన రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details