ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాల సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. ఒంగోలుకు చెందిన పాలేటి బుజ్జి కందుకూరులోని తన సోదరింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో కోల్లా బాలాజీ మృతిచెందగా పలేటి బుజ్జికి తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వైద్యునికి కాలు విరిగింది. క్షతగాత్రులను కందుకూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఢీకొన్న రెండు ద్విచక్రవాహనాలు.. ఒకరు మృతి - person died
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనలు ఢీకొన్నాయి. ఇందులో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతి