క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మందిని ప్రకాశం జిల్లా వేటపాలెం పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నానికి చెందిన చేబ్రోలు లక్ష్మీ బాలాజీ బెట్టింగ్ బుక్కర్గా తన ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. బెట్టింగ్ పెట్టే వారి నుంచి డబ్బులు తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి చేరవేస్తున్నాడు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్ఐ కమలాకర్, సిబ్బంది ఆ ఇంటిపై దాడిచేసి సోదాలు నిర్వహించారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిని అరెస్టుచేసినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఎస్.ఐ కమలాకర్ వెల్లడించారు.
ARREST: వేటపాలెంలో క్రికెట్ బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా వేటపాలెంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వేటపాలెంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 8 మంది అరెస్ట్