ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా ప్రియుడితో మాట్లాడించండి... లేదంటే చచ్చిపోతా' - women halchal in bachupalli ps for her lover

తనను ప్రేమించి... సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని... ఓ యువతి పోలీసుస్టేషన్​లో హల్​చల్​ చేసింది. తన ప్రియుడిని తెచ్చివ్వమని... లేదంటే సూసైడ్​ చేసుకుంటానని బెదిరించింది. ఈ ఘటన హైదరాబాద్​లోని బాచుపల్లి పీఎస్​లో జరిగింది.

women-halchal-in-bachupalli-ps-for-her-lover
women-halchal-in-bachupalli-ps-for-her-lover

By

Published : Dec 26, 2019, 1:25 PM IST

'నా ప్రియుడితో మాట్లాడించండి.. లేదంటే చచ్చిపోతా'

నెల్లూరుకు చెందిన అశ్విత తన కుటుంబంతో కలిసి హైదరాబాద్​లోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటుంది. బాచుపల్లిలో ఉండే చందు అనే వ్యక్తితో అశ్వితకు పబ్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త... ప్రేమగా మారి కొంత కాలం వీరిద్దరు సహజీవనం చేశారు.

ముఖం చాటేసిన ప్రియుడు...
ఈ మధ్య ప్రియుడు చందు ముఖం చాటేస్తు తప్పించుకు తిరిగుతున్నాడు. ఫోన్​లో కూడా అందుబాటులో లేకపోవడంతో విసిగిపోయిన అశ్విత... ఇవాళ బాచుపల్లిలో చందు ఉండే నివాసానికి వెళ్లింది. చందు లేకపోవడంతో కోపంతో ఉన్న అశ్విత బాచుపల్లి పీఎస్​కు వెళ్లి తన ప్రియుడిని తీసుకుని రావాలని హల్​చల్​ చేసింది. ప్రియుడితో 10 నిమిషాలు మాట్లాడించాలని లేదంటే పీఎస్​లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

గతంలోనూ ఇలాగే...
అశ్వితకు పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరకు బాచుపల్లి సీఐ జగదీశ్వర్​ షీటీం వారిని పిలిపించి కౌన్సిలింగ్​ ఇప్పించాడు. అశ్విత అన్నను పిలిపించి... ఆమెను అప్పజెప్పాడు. చందుని తీసుకురావడానికి ఫిర్యాదు రాసివ్వమంటే అశ్విత నిరాకరించింది. గతంలోనూ రాయదుర్గం పీఎస్​లో ఇలానే హల్​చల్​ చేసిందని పోలీసులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details