నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని షబ్బీర్ కాలనీలో గత రెండు నెలలుగా తాగునీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకున్ననాథుడే కరవయ్యారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ పవన్ కుమార్ ను, ప్రత్యేక అధికారిని కలసి సమస్యను వివరించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆర్ డబ్ల్యూఎస్ కృష్ణ రావటంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు. కాలనీలో మోటారు చెడిపోయి రెండు నెలలు అవుతున్న పట్టించుకున్న అధికారి లేరని వాపోయారు. ఎంపీడీవో, పంచాయతీ అధికారులకు ఎన్ని సార్లు మెరపెట్టుకున్న పట్టించుకోలేదన్నారు. వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తే ఏ మూలకు సరిపోవటం లేదన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఉండే మహిళలు నీటి కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తుందని వాపోయారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
'తాగడానికి నీరు లేదు...పట్టించుకున్న అధికారి లేరు'
రెండు నెలలుగా తాగునీరు లేదు...ఎన్నిసార్లు మెురపెట్టుకున్న పట్టించుకున్న అధికారి లేడు..వారానికి ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసిన సరిపోని వైనం..ఇది నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని షబ్బీర్ కాలనీ వాసుల పరిస్థితి.
'తాగడానికి నీరు లేదు...పట్టించుకున్న అధికారి లేరు'