మీడియాను అడ్డుకోవడమే కాదు, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలని తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా వైకాపాపై విమర్శలు చేశారు. కొన్ని ఛానళ్లకు అసెంబ్లీ లైవ్ అనుమతి నిరాకరించడం ప్రత్యక్ష కక్ష సాధింపేనని ఆయన ఆరోపించారు. వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే అనుమతి ఇవ్వనట్లు కనిపిస్తోందన్నారు. అంతమాత్రాన నిజాలు బయటకు రాకుండా ఆపలేరన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రత్యక్షంగా ఖూనీ చేయడమేనని సోమిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
'మీడియా ఛానళ్ల నియంత్రణ.. ప్రత్యక్ష కక్ష సాధింపే'
అసెంబ్లీ సమావేశాలు ప్రసారం చేయకుండా కొన్ని మీడియా ఛానళ్లను నియంత్రించడాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు. వైకాపా ప్రజావ్యతిరేక చర్యలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో ఈవిధంగా చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఇదీ చదవండి :