ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11 ఏళ్ల చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడి ! - కామాంధుడు లైంగిక దాడి

కూతురు వరసయ్యే 11 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా బసవరాజుపాలెంలో జరిగింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

11 ఏళ్ల చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడి
11 ఏళ్ల చిన్నారిపై కామాంధుడు లైంగిక దాడి

By

Published : Jul 15, 2020, 1:47 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెంలో దారుణం జరిగింది. కూతురు వరుసయ్యే 11 ఏళ్ల చిన్నారిపై 35 ఏళ్ల కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. అదే గ్రామానికి చెందిన నిందితుడు మేకలు మేపుతున్న చిన్నారికి తనసెల్​ఫోన్​లో బూతుబొమ్మలు చూపించాడు. అనతంరం బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పగా...వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details