ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 7:33 PM IST

ETV Bharat / state

ఏం సాధించారని పాదయాత్ర ఉత్సవాలు?: భాజపా

సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంపై వైకాపా నాయకులు ఉత్సవాలు చేయడాన్ని.. భాజపా విమర్శించింది. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏం సాధించారని నెల్లూరులోని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు. సరైన విధానం లేకుండానే వైకాపా పాలన సాగిస్తోందని మండిపడ్డారు.

nellore bjp fires on government
వైకాపా పాదయాత్ర ఉత్సవాలపై మండిపడుతున్న నెల్లూరు భాజపా నాయకులు

మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి అధికారం చేపట్టిన జగన్.. ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. వైకాపా ప్రభుత్వం సరైన విధానం లేకుండానే పాలన సాగిస్తోందని.. నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి విమర్శించారు.

ఇసుక విధానాన్ని ఇప్పటికే అయిదుసార్లు మార్చారని ఆంజనేయరెడ్డి గుర్తు చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకుగానీ, ప్రైవేటు సంస్థకుగానీ అప్పగించాలని నిర్ణయించడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. గతంలో టన్ను ఇసుక 350 రూపాయలుంటే.. ఇప్పుడు 470కి పెరిగిందని ఎద్దేవా చేశారు. పోలవరం ఆలస్యం కావడానికి గత, ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలు ఇవ్వలేని ప్రభుత్వం.. ఉత్సవాల పేరుతో ప్రజల వద్దకు వస్తే నిలదీయాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details